Home AP కూలీకి రూ.కోటి లాటరీ

కూలీకి రూ.కోటి లాటరీ

6
0

AP 39TV 19ఏప్రిల్ 2021:

పఠాన్‌కోట్‌: పంజాబ్‌లోని పఠాన్‌కోట్‌ జిల్లా అకోటా గ్రామానికి చెందిన రోజువారీ కూలీ రాత్రికి రాత్రే కోటీశ్వరుడైపోయాడు. లాటరీ రూపంలో అతడిని అదృష్టం వరించింది. బోదరాజు అనే కూలీ రూ.100 పెట్టి కొన్న లాటరీ అతడి జీవితాన్నే మార్చేసింది. ఏప్రిల్‌ 14న బోదరాజు రూ.100 పెట్టి లాటరీ టికెట్‌ కొన్నాడు. కాగా లూథియానాలో న్యాయనిర్ణేతల సమక్షంలో జరిగిన డ్రాలో బోదరాజు కొన్న లాటరీని అదృష్టం వరించింది. ఈ విషయాన్ని లాటరీల నిర్వాహకుడు అశోక్‌.. బోదరాజుకు తెలియజేశాడు. త్వరలోనే నగదు అందిస్తామని వెల్లడించాడు. ఈ ఆనందాన్ని భార్య, ఇద్దరు కూతుళ్లతో పంచుకున్న బోదరాజు.వచ్చే డబ్బుతో పిల్లలకు మంచి చదువు చెప్పిస్తానని పేర్కొన్నాడు.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here