AP 39TV 01మే 2021:
గత కొద్దిరోజుల క్రితం నగరంలోని 17వ డివిజన్ కు చెందిన వైసిపి కార్పొరేటర్ చింతకుంట పద్మావతమ్మ అనారోగ్యంతో మృతి చెందారు. ఈ సందర్భంగా శనివారం 17వ డివిజన్ లోని ఆమె నివాసం నందు ఏర్పాటు చేసిన సంతాపసభకు ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె చిత్రపటానికి ఎమ్మెల్యే అనంత నివాళులర్పించారు.అనంతరం ఎమ్మెల్యే అనంత మాట్లాడుతూ పద్మావతమ్మ సేవలు మరువలేనివని గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ మహమ్మద్ వసీం సలీమ్ ,డిప్యూటీ మేయర్ వాసంతి సాహిత్య ,పలువురు కార్పొరేటర్లు,ముఖ్య నాయకులు పాల్గొన్నారు.
