AP 39TV 04మే 2021:
జిల్లాలో గత సంవత్సరం ఖరీఫ్ సీజన్ లో రైతులు వేసిన వేరుశనగ పంట కోత సమయంలో అధిక వర్షాల వలన పంట పూర్తిగా దెబ్బతిందని ఏపీ రైతు సంఘం రాప్తాడు మండల అధ్యక్షులు పోతలయ్య తెలిపారు. రాప్తాడు మండల కేంద్రంలోని కెనరా బ్యాంకు మేనేజర్ కు రైతులతో కలిసి వినతిపత్రం అందించారు. ఈ సంధర్భంగా మాట్లాడుతూ ప్రస్తుతం కరోనా వలన బ్యాంకుల పనివేళలు తగ్గించడం వలన రైతులు పంట రుణాలు రెన్యువల్ చేయడానికి చాలా ఇబ్బందులు పడుతున్నారు. మాస్కులు ధరించి సామాజిక దూరం పాటిస్తూ పంట రుణాలు చేసుకోవడానికి సమయం ఎక్కువ పడుతుందన్నందు వలన రైతులు బ్యాంకు అధికారుల ఆరోగ్యాలను దృష్టిలో ఉంచుకొని పంట రుణాల రెన్యువల్ గడువు ఆగస్టు 30 వరకు పొడిగించాలన్నారు. రెన్యువల్ సమయంలో రైతుల నుండి కేవలం వడ్డీ మాత్రమే పట్టించుకొని రెన్యువల్ చేయాలన్నారు. స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం రుణాలు పెంచాలన్నారు. మార్టి గేజ్ లేకుండా 3 లక్షల వరకు పంట రుణాలు ఇవ్వాలన్నారు. వేరుశనగ పంటకు ఎకరాకు 35 వేల రూపాయల రుణం ఇవ్వాలన్నారు. రెన్యువల్ సమయంలో రైతులను దృష్టిలో ఉంచుకొని బ్యాంకుల దగ్గర నీడ మంచినీరు ఏర్పాటు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో మండల కార్యదర్శి చంద్రశేఖర్ రెడ్డి రైతులు పాల్గొన్నారు.
