Home AP ఎమ్మెల్యే సిద్ధారెడ్డి సహకారంతో ఆదర్శ వార్డు గా అభివృద్ధి చేస్తాం

ఎమ్మెల్యే సిద్ధారెడ్డి సహకారంతో ఆదర్శ వార్డు గా అభివృద్ధి చేస్తాం

5
0

AP 39TV 03మార్చ్ 2021:

వార్డు ప్రజలు అభివృద్ధి సంక్షేమం వారి సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పని చేస్తానని సేవకురాలిగా ఉండి సేవలందిస్తానని తనకు కౌన్సిలర్గా గెలిపించాలని కోరుతూ 8 వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి కొమ్ము గంగాదేవి శంకర ప్రచారం నిర్వహించారు.

8 వార్డు కౌన్సిలర్ అభ్యర్థి కొమ్ము గంగాదేవి శంకర మాట్లాడుతూ

కౌన్సిలర్ గా వార్డులో సిమెంట్ రోడ్లు వేయడంతో పాటు తాగునీటి సమస్యను పరిష్కారం చేస్తాను, తనను ఆదరించి కౌన్సిలర్గా గెలిపిస్తే కదిరి ఎమ్మెల్యే డాక్టర్ పివి సిద్ధారెడ్డి సహకారంతో 8 వ వార్డులో దీర్ఘకాలంగా నెలకొన్న సమస్యను శాశ్వతంగా పరిష్కరిస్తామని పేర్కొన్నారు. వార్డు ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని పేర్కొన్నారు. కరోనా సమయంలో వార్డు ప్రజలకు నిత్యావసర సరుకులు కూరగాయలు అందించడంతో పాటు ప్రజలకు మరింత చేయూతను అందించడం జరిగిందన్నారు.ఈ ప్రచార కార్యక్రమంలో 8 వార్డ్ అభ్యర్థి కొమ్ము గంగాదేవి శంకర మరియు ఇతర వైయస్సార్ పార్టీ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here