Home AP ప్రజా సమస్యలను పరిష్కరించడానికే గుడ్ మార్నింగ్ కార్యక్రమం – ఎమ్మెల్యే డాక్టర్ పివి సిద్ధారెడ్డి

ప్రజా సమస్యలను పరిష్కరించడానికే గుడ్ మార్నింగ్ కార్యక్రమం – ఎమ్మెల్యే డాక్టర్ పివి సిద్ధారెడ్డి

15
0

AP 39TV 12ఏప్రిల్ 2021:

ప్రజా సమస్యలు పరిష్కరించడానికే పట్టణంలో గుడ్ మార్నింగ్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే డాక్టర్ పివి సిద్ధారెడ్డి పేర్కొన్నారు. సోమవారం పట్టణంలోని 12వ వార్డు పరిధిలో స్థానిక కౌన్సిలర్ , మున్సిపల్ చైర్ పర్సన్ నజీమ్నిషా వైస్ చైర్మన్ గంగాదేవి, అధికారులతో కలిసి పర్యటించారు. వార్డు పరిధిలోని అన్ని వీధుల్లో పర్యటించి సమస్యలు అడిగి తెలుసుకున్నారు.
డ్రైనేజ్, హౌస్ సైట్ పట్టాలు, సిమెంట్ రోడ్ల నిర్మాణం చేపట్టాలని, పించన్లు తదితర సమస్యలును వార్డు ప్రజలు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లారు. స్పందించిన ఎమ్మెల్యే సమస్యలను వెంటనే పరిష్కరించాలని సంబంధించిన అధికారులకు ఆదేశించారు. ఏమైనా సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని వార్డు ప్రజలను కోరారు నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటారని ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలన్నీ అందేవిధంగా కృషి చేస్తానన్నారు .ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ చెన్నుడు, డి.ఈ, ఎ. ఈ, శానిటరీ ఇన్స్పెక్టర్లు, సచివాలయం సిబ్బంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here