Home AP నాగలమడక నుంచి పేరూరు పాదయాత్ర ముగింపు

నాగలమడక నుంచి పేరూరు పాదయాత్ర ముగింపు

17
0

మహోత్తర ఘట్టానికి తెర
– నాగలమడక నుంచి పేరూరు పాదయాత్ర ముగింపు
– ముగింపు రోజున పేరూరులో భారీ బహిరంగ సభ
– మంత్రి శంకర్‌నారాయణ, ఎంపీ గోరంట్ల మాధవ్‌ హాజరు
– భారీ సంఖ్యలో హాజరైన వైఎస్సార్‌ అభిమానులు, కార్యకర్తలు

రాప్తాడు నియోజకవర్గంలో మహోత్తర ఘట్టానికి తెరదీశారు. పేరూరు డ్యాంకు నీళ్లు తెచ్చారు. రైతుల్లో ఆనందం నింపారు. గొల్లపల్లి రిజర్వాయర్‌ నుంచి నాగలమడక చెరువుకు.. అక్కడి నుంచి పేరూరు డ్యాంలోకి నీరు చేర్చడంలో ప్రజాప్రతినిధులు సఫలీకృతులయ్యారు. ఈ క్రమంలో రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి రెండు రోజుల పాటు చేపట్టిన పాదయాత్ర నాగలమడకలో ప్రారంభమైన పేరూరులో ముగిసింది.

జలహారతి ఇచ్చి..
పాదయాత్ర ముగింపు సందర్భంగా పేరూరు డ్యాంలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా మంత్రి శంకర్‌నారాయణ, హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్‌ హాజరయ్యారు. ఈసందర్భంగా గంగపూజ చేసి జలహారతి ఇచ్చారు. అనంతరం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రవేశపెట్టిన పథకాల గురించి ప్రశంసించారు. ఎన్నో ఏళ్లుగా నీటిబొట్టు లేకుండా ఇబ్బంది పడుతున్న రాప్తాడు నియోజకవర్గ ప్రజలకు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం కల సాకారం చేసిందని పేర్కొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here