Home AP కరోనా వ్యాప్తికి అధికారులే ప్రోత్సహిస్తున్నారా?

కరోనా వ్యాప్తికి అధికారులే ప్రోత్సహిస్తున్నారా?

12
0

AP 39TV 19ఏప్రిల్ 2021:

విశాఖ జిల్లా లో కరోనా వ్యాప్తికి అధికారులే కారణమని విమర్శలు వినిపిస్తున్నాయి. దీనికి ఆదివారం ఆర్. కె. బీచ్ లో జరిగిన భారీ ఎత్తున జరిగిన బహిరంగసభ ఒక ఉదాహరణ అని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సభకు హాజరైనవారు తప్పనిసరిగా మాస్క్లు ధరించాలని, భౌతిక దూరం పాటించాలని బోర్డులు పెట్టారు. కానీ ఆచరణలో అమలు కాలేదు. పర్మిషన్ ఇచ్చిన అధికారులు దీనిని అమలు చేయలేకపోయారు. పోలీసులు ప్రేక్షక పాత్ర వహించారు. భారీగా హాజరైన ప్రజలను అదుపు చేయలేకపోయారంటే అనుకోవచ్చు. కనీసం వేదికమీద కూర్చున్న ఉపన్యాసకులు కూడా భౌతిక దూరం పాటించలేదు. ఉక్కు పోరాటానికి జగన్ సర్కార్ మద్దతు ఇచ్చివుండవచ్చు, కానీ ఇలా కరోనా వ్యాప్తికి సహకరించడం సరికాదని పలువురు వ్యాఖ్యానించారు. అంతేకాదు హాజరైనవారిలో చాలామంది మాస్క్లు దరించక పోవడం విచారకరం. ఇప్పటికైనా జిల్లా అధికారులు తగు శ్రద్ధవహించి కరోనా వ్యాప్తికి అడ్డుకట్ట వేసే దిశగా చర్యలు చేపట్టాలని పలువురు కోరుతున్నారు.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here